అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయానికి రూ.2.25 కోట్ల నిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో నూతన భవన నిర్మాణానికి పరిపాలనా అనుమతి
చైతన్యగళం హుస్నాబాద్, జూన్ 27 : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృషితో అక్కన్నపేట మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల పరిపాలనా అనుమతిని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాలు లేదా శిథిలావస్థలో ఉన్న 10 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు (ఆర్డీవోలు), 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణం కోసం మొత్తం రూ.263.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ జి.ఓ. విడుదల చేసింది....