CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 9:36 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి – సుంకిరెడ్డి

కల్వకుర్తి, జూన్ 25 (చైతన్యగళం): కల్వకుర్తి పట్టణంలోని కళ్యాణ్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ కార్ వాషింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం యజమాని రాజు కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతంగా కొనసాగి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకోవాలి. నేటి పోటీ ప్రపంచంలో స్వయం ఉపాధి రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేస్తే మంచి విజయాలు సాధించవచ్చు. యువతలో వ్యాపార దృక్పథం పెరగడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నరేందర్ గౌడ్, కొండల్ యాదవ్, శ్రీపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.