దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గుతాయా..?

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఏకంగా ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి ముందు ఉన్న ధరల స్థాయికి ముడిచమురు రేట్లు దిగివచ్చాయి. మరి గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు ఇంతలా తగ్గుతుంటే.. మన దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అనే విషయాలు తెలుసుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఎట్టకేలకు భారీగా దిగివస్తున్నాయి. యుద్ధానికి ముందు ఉన్న ధరల స్థాయికి క్రూడ్ ఆయిల్ రేట్లు పడిపోతుండటంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు...