ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తాం
అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్ అమరావతి, జూన్ 25(చైతన్య గళం): ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను...