డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి -పోలీసు అధికారుల పిలుపు
మహబూబాబాద్, జూన్ 25 (చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. రాజసుధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టౌన్ ఎస్సైలు సూరయ్య, బసురుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా చదువుపై దృష్టి సారించాలి. ఒకసారి డ్రగ్స్‌కు బానిసైతే జీవితమే నాశనమవుతుంది” అని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం తెలిసిన...