వెనిజులాలో వరుస భూకంపాలు

కారకస్,జూన్ 25(చైతన్యగళం): జూన్ 24–25 తేదీల్లో వెనిజులా వరుసగా రెండు భారీ భూకంపాలకు గురైంది. మొదట 7.2 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలకు కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఈ వరుస ప్రకంపనలతో రాజధాని కారకస్ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. ప్రజలు రోడ్లపైకి పరుగులు తీస్తూ భయాందోళనలో గడిపారు. సముద్రతీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. అయితే తరువాత అది తగ్గించబడింది. భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉందని...