ప్రయివేట్, సిబిఎస్ఈ విద్యాసంస్థల్లో స్పెషల్ టీచర్స్ నియామకం కోసం వినతి
హైదరాబాద్/సెక్రటేరియట్, జూన్ 25 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కార్యాలయంలో గురువారం స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మరియు వయోవృద్ధుల శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ వినతిని ఎన్‌పీఆర్‌డీ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కే. వెంకట్, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ కలిసి అందజేశారు. రాష్ట్రంలో ప్రయివేట్, సిబిఎస్ఈ విద్యాసంస్థల్లో స్పెషల్ టీచర్స్ నియమించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు....