ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్

మహబూబాబాద్, జూన్ 25 (చైతన్యగళం): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన లంబాడీ, ఎరుకల, యానాది తెగల రిజర్వేషన్ స్వర్ణోత్సవాల వేడుకలకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరయ్యారు. అనంతరం ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో లంబాడీ సమాజం ఎస్టీ జాబితాలో చేరి నేటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ స్వర్ణోత్సవాలను...