CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 2:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

చేగురులో మెడికల్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

షాద్‌నగర్, జూన్ 25 (చైతన్యగళం): నందిగామ మండలం చేగురు గ్రామంలో జంగిలి ప్రవీణ్ ఏర్పాటు చేసిన మెడికల్ షాప్‌ను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన షాప్ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా సేవలు అందించాలని సూచించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ పిఎసిస్ చైర్మన్ మామిళ్ల విటల్, నర్సప్పగూడ ఉప సర్పంచ్ సిద్దయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుదర్శన్ గౌడ్, జంగిల్ కుమార్, చేగురు గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కుగూడ రవి, గ్రామ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.