పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ 17వ వర్ధంతి వేడుకలు

హుస్నాబాద్, జూన్ 25 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పాప్ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మైఖేల్ జాక్సన్ 17వ వర్ధంతి వేడుకలను ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైఖేల్ జాక్సన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిడిశెట్టి రాజు మాట్లాడుతూ, “ప్రపంచ సంగీత రంగంలో మైఖేల్ జాక్సన్ చేసిన సేవలు చిరస్మరణీయాలు. తన అద్భుత గాన ప్రతిభ, నృత్య నైపుణ్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప...