అమరుల స్థూపం భూముల కబ్జాపై హుస్నాబాద్ జేఏసీ ఆగ్రహం
హుస్నాబాద్, జూన్ 25 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని అమరుల స్థూపం పరిసర భూముల కబ్జాపై జేఏసీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సర్వే నంబర్ 1189లోని చారిత్రాత్మక స్థూపం భూమి అధికార అండతో అన్యాక్రాంతం అవుతోందని ఆరోపించారు. పీపుల్స్ వార్ ఉద్యమ అమరుల స్మారకార్థం నిర్మించిన 88 అడుగుల స్థూపం పరిసర భూములు ప్రజల వారసత్వ సంపదగా నిలిచాయని పేర్కొంటూ, స్థూపం పునర్నిర్మాణం, స్మృతి వనం ఏర్పాటు చేస్తామని గతంలో...