CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 2:19 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వంగూరులో ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ

వంగూరు, జూన్ 25 (చైతన్యగళం): భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్–2026 ప్రత్యేక సవరణలో భాగంగా వంగూరు మండల కేంద్రంలో ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. వంగూరు, వెలమల్లపల్లి గ్రామాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో వంగూరు తహసిల్దార్ మురళీమోహన్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చీమ్ముల రాజశేఖర్ రెడ్డి, వంగూరు సర్పంచ్ పురుగుల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్ధన్, రమేష్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో భాగంగా ప్రతి ఓటరు ఈ ఫారాలను స్వీకరించి, పూర్తి చేసి తిరిగి బి ఎల్ ఓలకు అందజేయాలని అధికారులు సూచించారు.