మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

మహబూబాబాద్, జూన్ 25 (చైతన్యగళం): విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ వయసులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకుంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సీనియర్ న్యాయవాది వై. చెన్న మల్లా రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గౌతమి ఇంటర్మీడియట్ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. “స్నేహితుల ప్రభావం, క్షణికానందం కోసం డ్రగ్స్,...