నగునూరులో పదవ తరగతి ప్రతిభావంతుల సన్మానం
కరీంనగర్ రూరల్, జూన్ 25 (చైతన్యగళం): నగునూరు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఘనంగా సన్మానించబడ్డారు. గ్రామ సర్పంచ్ సాయిల్ల శ్రావణి, సొసైటీ డైరెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కుమారికి ₹10,000, మాయావతికి ₹5,000 నగదు బహుమతులు అందజేశారు.సర్పంచ్ శ్రావణి మాట్లాడుతూ, “క్రమశిక్షణ, పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించడం అభినందనీయం” అన్నారు. మహేందర్ మాట్లాడుతూ, “విద్యార్థుల ప్రతిభ పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు గౌరవం తెచ్చింది” అని ప్రశంసించారు.70 మంది విద్యార్థులలో 23 మంది 500 మార్కుల...