పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం

న్యూఢిల్లీ: జూన్ 22న ఢిల్లీ నుండి అమృత్‌సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI‑479 విమానం తాత్కాలికంగా పాక్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్‌సర్ విమానాశ్రయంలో పక్షి ఢీకొన్న ఘటన కారణంగా రన్‌వే తనిఖీ జరుగుతుండటంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం హోల్డ్‌లోకి వెళ్లింది. ఈ సమయంలో రాడార్ వెక్టరింగ్ లోపం వల్ల విమానం పాక్ గగనతలంలోకి చేరింది. పాక్ ATC వెంటనే భారత అధికారులను సంప్రదించి హెచ్చరిక ఇచ్చింది. రెండు దేశాల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమన్వయం చేసుకుని విమానాన్ని సురక్షితంగా ఢిల్లీకి...