యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పిలుపు మహబూబాబాద్, జూన్ 24(చైతన్యగళం): జిల్లా ఎస్పీ డా. శబరీష్ యువత తమ జీవిత లక్ష్యాల సాధనపై దృష్టి సారించి, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన “మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ – “గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయి. విద్యార్థులు...