ఖానాపూర్, జూన్ 24(చైతన్యగళం): ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం ఒక పేషెంట్ ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంగళవారం సాయంత్రం ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి విద్యుత్ పునరుద్ధరించాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్శనలో కౌన్సిలర్లు చిన్నం రాజు, రా సత్యం, నిమ్మల రమేష్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, ఎస్సై గైక్వాడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్ అబ్దుల్, కార్యకర్తలు పాల్గొన్నారు.