- మహబూబాబాద్‌లో సత్య శ్రీ మెడికల్ & వినాయక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం
మహబూబాబాద్, జూన్ 24 (చైతన్య గళం): మహబూబాబాద్ మున్సిపల్ కేంద్రం రాహుల్ నగర్‌లో సత్య శ్రీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ – వినాయక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి మెడికల్ షాప్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ – “గ్రామీణ, పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉండటం అత్యవసరం. ఇటువంటి సంస్థలు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్య సలహాలు అందిస్తూ కీలక పాత్ర పోషించాలి” అని ఆకాంక్షించారు.
ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ మురళి నాయక్, భరత్ చందర్ రెడ్డి కలిసి బిపి చెక్ చేయించుకున్నారు.
తరువాత వీరిద్దరూ వినాయక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఆర్ఎంపి వైద్యుడు, సత్య శ్రీ మెడికల్ స్టోర్ ప్రొప్రైటర్ కాటా సాగర్ రాజు, దేశగాని కృష్ణ, కాటా శ్రీనివాస్లను అభినందించారు. పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్ గుగులో జ్యోతి రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ పరకాల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీపాల్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ గాడి పెళ్లి నాగేశ్వరరావు, 13వ వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్, 30వ వార్డు కౌన్సిలర్ గాడి పెళ్లి లలితా చరణ్, ఇతర వార్డు కౌన్సిలర్లు, మెడికల్ ఏజెన్సీ యజమానులు, వ్యాపారవేత్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.