రోడ్లపై వరద నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు
డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కరీంనగర్, జూన్ 24 (చైతన్యగళం): వర్షాకాలం నేపథ్యంలో నగరంలో రోడ్లపై వరద నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కలిసి రాంనగర్, రేకుర్తి, మంచిర్యాల చౌరస్తా, కలెక్టరేట్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ నాలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వరద నీరు రోడ్లపైకి...