CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 8:12 am Posted by : CHAITHANYA GALAM NEWS

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

హైదరాబాద్‏లోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -1 డివిజన్ల పరిధిలో బుధవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్‌ తెలిపారు.

హైదరాబాద్: హైదరాబాద్‏లోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -1 డివిజన్ల పరిధిలో బుధవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్‌ తెలిపారు. బౌద్ధ్దనగర్‌, ఎల్‌ఎన్‌ నగర్‌, దయారామార్కెట్‌, వీఎస్టీ, కృష్ణానగర్‌, కమలానగర్‌, జిందా తిలిస్మాత్‌, దిల్‌కుష, ఈనాడు, జవహర్‌లాల్‌నెహ్రూ, జగదీశ్‌మార్కెట్‌ ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, సంజీవయ్యనగర్‌, బసంత్‌కాలనీ, శివాలయం, వైఎంసీఏ, ఆర్‌వోఎమ్‌, బంజారా ఎవెన్యూ, బొగ్గులకుంట, తాజ్‌మహల్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.

రామంతాపూర్‌: సికింద్రాబాద్ రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల సబ్‌ స్టేషన్‌ పరిధిలోని ఫీడర్‌లలో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ కూతడి లావణ్య తెలిపారు. అందులో భాగంగా శ్రీనగర్‌ ఫీడర్‌లోని శ్రీనగర్‌ కాలనీ, భరత్‌ నగర్‌, శ్రీరమణ పురం, రిజిస్ర్టేషన్‌ ఆఫీస్‌, సత్యనగర్‌, కురుమ నగర్‌, కేసీఆర్‌ నగర్‌ కమాన్‌ ప్రాంతాలలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, కామాక్షీ పురం ఫీడర్‌లోని వివేక్‌ నగర్‌, కామాక్షీ పురం, వాసవీ నగర్‌, రాంరెడ్డి నగర్‌, ప్రాంతాలలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఆమె తెలిపారు.

 

ఏఎస్ రావునగర్‌లో…

ఏఎస్ రావునగర్‌: జికేనగర్‌, ఎంజే కాలనీ 11కేవి ఫీడర్‌లలో సాంకేతిక మరమ్మతుల కారణంగా బుధవారం ఆయా కాలనీలలో విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఎస్ రావునగర్‌ ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. గోకుల్‌నగర్‌, పార్వతీనగర్‌, హెచ్‌ఐజి-ఏ, ఆఫీసర్స్‌ కాలనీ జి-బ్లాక్‌, శారదా ఆస్పత్రి, వాటర్‌ వర్క్స్‌, అంకురా ఆస్పత్రి ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఎంజే కాలనీ రోడ్‌ నం-1,2,3, గాయత్రీనగర్‌, రోడ్డు నెం-6,7,8,9,10, సాయిబాబ ఆలయం, ఎల్‌ఐజి-బి, శ్రీరాంనగర్‌, గ్జేవియర్‌ స్కూల్‌, కుర్ర హోమ్స్‌ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ గంగాభవాని అన్నారు. వినియోగదారులు తమతో సహకరించాలని ఆమె కోరారు.

 

నేరేడ్‌మెట్‌లో..

నేరేడ్‌మెట్‌: నేరేడ్‌మెట్‌ వాజ్‌పేయి నగర్‌లోని దీన్‌ దయాల్‌ నగర్‌ 11 కేవీ ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మలు నరికివేత నిర్వహణ పనులు కారణంగా ఈ క్రింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ లత తెలిపారు. బుధవారం ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు హిల్‌ కాలనీ, దీన్‌ దయాల్‌ నగర్‌, కాకతీయ నగర్‌, గీతా నగర్‌, ఆఫీసర్స్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదు. వాయుపురి సబ్‌ స్టేషన్‌ పరిధిలోని జేకే కాలనీ 11 కేవీ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జేకే కాలనీ, కాకతీయ నగర్‌, వినోబా నగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్‌, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈలు ఇంద్రసేనారెడ్డి, బొనిగాల విజయప్రకాష్‌, భీమాలింగప్పలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

– వసంతనగర్‌ పరిధిలో.. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.

 

– కేపీహెచ్‌బీ పరిధిలో.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల తహసీల్దార్‌ కార్యాలయం, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్‌-1 పార్కు, ఐసీఐసీఐ బ్యాంక్‌, పూజా ఎలక్ర్టికల్‌ షాపు వరకు, కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తహసీల్దార్‌ కార్యాలయం రోడ్డు, పోస్ట్‌ ఆఫీస్‌, చాకలి డబ్బా, మహారాష్ట్ర బ్యాంక్‌, ఆర్‌ఆర్‌ చికెన్‌ సెంటర్‌, ఎల్‌ఐజీ 302-384, ధనలక్ష్మి సెంటర్‌.

– బాలాజీనగర్‌ పరిధిలో.. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంజనేయనగర్‌, ఐడీఎల్‌ లేక్‌, కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌, లోధా అపార్ట్‌మెంట్స్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు కేపీహెచ్‌బీ ఏడోఫేజ్‌, నాలుగోఫేజ్‌ అయ్యప్ప స్వామి టెంపుల్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈలు తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

 

హైదర్‌నగర్‌ పరిధిలో..

హైదర్‌నగర్‌: శ్రీరామ్‌నగర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు కృష్ణవేణినగర్‌, సాయిచరణ్‌కాలనీ, తులసీనగర్‌, సాయిప్రశాంత్‌నగర్‌, హెచ్‌ఎంటీహిల్స్‌, శంషిగూడ, ఇందిరహిల్స్‌లో విద్యుత్‌ ఉండదన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు హెచ్‌ఎంటీహిల్స్‌, తులసీనగర్‌, ఆదిత్యనగర్‌, శుభోదయ కాలనీ, ప్రగతినగర్‌ రోడ్డులో విద్యుత్‌ ఉండదన్నారు.

 

హైదర్‌నగర్‌: శ్రీరామ్‌నగర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు కృష్ణవేణినగర్‌, సాయిచరణ్‌కాలనీ, తులసీనగర్‌, సాయిప్రశాంత్‌నగర్‌, హెచ్‌ఎంటీహిల్స్‌, శంషిగూడ, ఇందిరహిల్స్‌లో విద్యుత్‌ ఉండదన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు హెచ్‌ఎంటీహిల్స్‌, తులసీనగర్‌, ఆదిత్యనగర్‌, శుభోదయ కాలనీ, ప్రగతినగర్‌ రోడ్డులో విద్యుత్‌ ఉండదన్నారు.

 

రాయదుర్గం పరిధిలో..

రాయదుర్గం: టీఎన్‌జీఓస్, నానక్‌రాంగూడ 11కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివకృష్ణ ప్రసాద్‌ తెలిపారు. నానక్‌రాంగూడ ఫైనాన్షిల్‌ డిస్ర్టిక్ట్‌, సెక్రటరీ కాలనీ, టీఎన్‌జీఓ్‌స ఫేజ్‌-2లో విద్యుత్‌ ఉండదన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శాంతినగర్‌, చందానగర్‌, గంగారంలలో.. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు హుడాకాలనీ, చందానగర్‌, గంగారంలో విద్యుత్‌ ఉండదన్నారు.