రవీంద్రభారతి వేదికపై వీరబ్రహ్మంగారి నాటక ప్రదర్శన

హైదరాబాద్, జూన్ 24(చైతన్యగళం): 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికపై చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాలకు చెందిన కళాకారులు శ్రీ వీరబ్రహ్మంగారి చరిత్ర ఆధారంగా నాటక ప్రదర్శన చేసి ప్రేక్షకులను, అధికారులను భక్తి పరవశ్యంలో ముంచెత్తారు. శ్రీ వీరబ్రహ్మంగారు మరియు కడప నవాబుల మధ్య జరిగిన సన్నివేశాలను కళాకారులు అద్భుతమైన వేషభూషణాలు, నటనతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి విశేష ప్రశంసలు అందుకున్నారు. వారి ప్రదర్శనను భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఏఈఓ విజయ్ కుమార్ అభినందించారు. అనంతరం...