CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 2:23 pm Posted by : rakeshkashaveni12@gmail.com

రవీంద్రభారతి వేదికపై వీరబ్రహ్మంగారి నాటక ప్రదర్శన

హైదరాబాద్, జూన్ 24(చైతన్యగళం): 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికపై చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాలకు చెందిన కళాకారులు శ్రీ వీరబ్రహ్మంగారి చరిత్ర ఆధారంగా నాటక ప్రదర్శన చేసి ప్రేక్షకులను, అధికారులను భక్తి పరవశ్యంలో ముంచెత్తారు.

శ్రీ వీరబ్రహ్మంగారు మరియు కడప నవాబుల మధ్య జరిగిన సన్నివేశాలను కళాకారులు అద్భుతమైన వేషభూషణాలు, నటనతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి విశేష ప్రశంసలు అందుకున్నారు. వారి ప్రదర్శనను భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఏఈఓ విజయ్ కుమార్ అభినందించారు. అనంతరం కళాకారులను సన్మానించి, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షుడు అనువోజు వెంకటేశం, చిగురుమామిడి కళాకారుల మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్‌కుమార్, పున్న రమేష్, కుతాడి కొమరయ్య, నిలిగొండ కిషన్, చందబోయిన పరశురాములు, పోలోజు కుమార్‌స్వామి, పిన్నింటి దాసు, మాచర్ల శ్రీను, శ్రీరామోజు రాములు, విధిమౌళి, నిలిగొండ సదానందం, పోలోజు రమేష్, సుంచు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.