శుభాకాంక్షలు తెలిపిన తల్లోజు ఆచారి
దేవరకొండ, జూన్ 24 (చైతన్యగళం): శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ చైర్మన్‌గా నక్క వెంకటేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హాజరై, ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.
తల్లోజు ఆచారి మాట్లాడుతూ, “శ్రీ అయ్యప్ప స్వామి సేవలో ఉండడం పూర్వజన్మ సుకృతం. ఇలాంటి మహోన్నతమైన సేవా భాగ్యం అందరికీ లభించదు. దేవాలయ అభివృద్ధికి, భక్తుల సేవకు అంకితభావంతో పనిచేయాలి” అని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ట్రస్ట్ చైర్మన్ నక్క వెంకటేష్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.