టీటీడీ ఎస్టీ ఉద్యోగులతో సమావేశం
తిరుపతి, జూన్ 24 (చైతన్యగళం): జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గౌరవ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, గౌరవ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)లో పనిచేస్తున్న షెడ్యూల్డ్ తెగల ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీ ఉద్యోగులు తమ సేవా సంబంధిత అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలు తదితర సమస్యలు, అభ్యర్థనలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని శ్రద్ధగా విన్న కమిషన్ ఛైర్మన్, సభ్యులు – “ఎస్టీల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు...