అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వరదలు

ఇటానగర్, జూన్ 24 (చైతన్యగళం): అరుణాచల్ ప్రదేశ్‌లో కురిసిన నిరంతర భారీ వర్షాల కారణంగా కీ పాన్యోర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించి నివాస కాలనీల్లోకి చేరింది. ఈ క్రమంలో NEEPCO ప్రాజెక్ట్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న రక్షణ గోడ కూలిపోవడంతో వరద నీరు మరింత ఉధృతమైంది.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రక్షణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధన,...