ఫ్రాన్స్‌లో తొలి ఎబోలా కేసు నమోదు

పారిస్, జూన్ 24 (చైతన్యగళం): ఫ్రాన్స్‌లో తొలి ఎబోలా కేసు నమోదైంది. కాంగోలో మానవతా సేవల కోసం వెళ్లి తిరిగి వచ్చిన ఒక వైద్యుడు ఎబోలా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ఎబోలా ప్రభావం యూరప్‌లోకి చేరడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ప్రస్తుతం ఆ వైద్యుడు పారిస్‌లోని ప్రత్యేక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఆయనతో సంబంధం ఉన్న వారందరిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజల్లో భయాందోళనలు రాకుండా...