హుస్నాబాద్ డయాలసిస్ కేంద్రంపై విమర్శలు
హుస్నాబాద్, జూన్ 24 (చైతన్యగళం): హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు డయాలసిస్ సేవలు సక్రమంగా అందడం లేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్ తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు పడకలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఎల్కపెల్లి కనకరాజు డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు సాంకేతిక సమస్యను కారణంగా చూపి వారం రోజులుగా చికిత్స అందించకుండా...