కోల్‌కతా, జూన్ 24 (చైతన్యగళం): తృణమూల కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ఆయన విదేశీ వైద్య చికిత్స కోసం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
బెనర్జీపై సీఐడీ విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా, కోర్టు తీర్పు ఆయనకు మరింత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.