కోల్‌కతాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోదాం

పశ్చిమ బెంగాల్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్ కుప్పకూలిన ఘటనలో డజన్ల కొద్దీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కోల్‌కతా, జూన్ 24 (చైతన్యగళం): కోల్‌కతా నగరంలోని తరతాలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు బుధవారం కూలిపోవడంతో కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం సమయంలో 50–60 మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా, కనీసం రెండు డజన్ల మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. రక్షణ చర్యలకు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి....