మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

కరీంనగర్, జూన్ 24 (చైతన్యగళం): మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా మానుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. కరీంనగర్ నగరంలోని అశోక్‌నగర్ మాదకద్రవ్య–మద్యపాన వ్యసన విముక్తి కేంద్రాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పునరావాస కార్యక్రమాలపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్స పురోగతిని...