అమరావతి అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం

అమరావతి, జూన్ 24(చైతన్యగళం): ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు జోహన్నెస్ జుట్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ అండ్ టీటీఎల్-(అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు-ఏఐయూడీపీ) గెరాల్డ్ పాల్ ఒలివర్, ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ సౌమ్య బజాజ్‌లతో కూడిన బృందం అమరావతిలో పర్యటించింది. ప్రపంచ బ్యాంకు బృందం తొలుత ఏపీసీఆర్‌డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించింది. అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టు (AIUDP) కింద చేపడుతున్న పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు...