పచ్చదనానికి అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ చేపట్టాలి
విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నందికొట్కూరు, జూన్ 23 (చైతన్యగళం): జిల్లాలో చేపడుతున్న హరితాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, విద్యాసంస్థల ఆవరణలను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.మంగళవారం జూపాడుబంగ్లా మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో చేపట్టిన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి, మొక్కల పెంపకం,...