టీఎంసీ చీఫ్‌గా మమత తొలగింపు

కోల్‌కతా, జూన్‌ 23(చైతన్యగళం): తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు సోమవారం రెబల్‌ ఎమ్మెల్యేల వర్గం ప్రకటించింది. సీనియర్‌ ఎమ్మెల్యే అరుప్‌ రాయ్‌ను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్టు తెలిపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ను 1998లో మమతనే స్థాపించారు. అయితే, ఇటీవలి ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తమదే ‘నిజమైన తృణమూల్‌ కాంగ్రెస్‌’ అని ప్రతిపక్షనేత రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలోని రెబల్స్‌ ప్రకటించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి మమత మేనల్లుడు, ఎంపీ.. అభిషేక్‌...