వైభవంగా కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ట వేడుకలు
ఆమనగల్లు, జూన్ 23(చైతన్య గళం): మాడుగుల మండలం నల్లవారి పల్లి గ్రామంలో కోట మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట వేడుకలు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామానికి చెందిన దివంగత ఇటికాల కిషన్ రెడ్డి కుటుంబికులు నూతన దేవాలయ నిర్మాణం చేపట్టారు. విగ్రహా ప్రతిష్ట నేపథ్యంలో దేవాలయాన్ని పచ్చటి తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయామనంగా అలంకరించారు. వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలివచ్చారు. అర్చకులు సీతారామ శర్మ ,...