ఆమనగల్లు, జూన్ 23(చైతన్య గళం): మాడుగుల మండలం నల్లవారి పల్లి గ్రామంలో కోట మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట వేడుకలు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామానికి చెందిన దివంగత ఇటికాల కిషన్ రెడ్డి కుటుంబికులు నూతన దేవాలయ నిర్మాణం చేపట్టారు. విగ్రహా ప్రతిష్ట నేపథ్యంలో దేవాలయాన్ని పచ్చటి తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయామనంగా అలంకరించారు. వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలివచ్చారు. అర్చకులు సీతారామ శర్మ , నాయనా చారి ఆధ్వర్యంలోని అర్చక బృందం శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహా ప్రతిష్ట అనంతరం మైసమ్మ దేవతను దర్శించుకుని భక్తులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగన్, ఉపసర్పంచ్ మధుసూదన్, నాయకులు జగన్ రెడ్డి, హనుమంత రెడ్డి, వెంకట్ రెడ్డి, అంజయ్య, సంపత్, విజయమ్మ, వెంకటమ్మ ,అండాలు, సరిత, ఆదిత్య, సువర్ణ, యాదగిరి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నారాయణరెడ్డి, శశికళ, సంధ్య, జంగయ్య, మల్లయ్య, అరవింద్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, శ్రీను, సందీప్ రెడ్డి, సంజీవరెడ్డి, వెంకటయ్య, సుఖ జీవన్ రెడ్డి, సునీత, పద్మమ్మ, పాండు, కృష్ణయ్య, వీరారెడ్డి, సత్యం, తదితరులు పాల్గొన్నారు.