మొహరం ఉరుసు వేడుకల్లో బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి
నందికొట్కూరు, జూన్ 23 (చైతన్యగళం): పగిడ్యాల మండల వనములపాడు గ్రామంలో కులమతాల భక్తుల ఆదరణ పొందిన తిక్కస్వామి దేవుడి ఉరుసు (మొహరం) పండుగను గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, పుల్యాల నాగిరెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఓంకార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మద్దిలేటి, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, మహేష్ నాయుడు, తిక్కస్వామి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.