పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం – సీపీ గౌష్ ఆలం

కరీంనగర్, జూన్ 17 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు.కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు తమ పరిధిలోని కేసుల పురోగతిని వివరించారు. సీపీ మాట్లాడుతూ, “మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి. షీ టీమ్స్, బ్లూ కోల్ట్స్ ద్వారా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలి” అని స్పష్టం చేశారు.విజిబుల్ పోలీసింగ్...