గంగపుత్ర సంఘం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకురాలు భోగ శ్రావణి
జగిత్యాల, జూన్ 10 (చైతన్య గళం):జగిత్యాల పట్టణంలోని వాణినగర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ జాతర బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్, బిజెపి నాయకురాలు భోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు సంఘ సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆముదరాజు, దూరిశెట్టి మమత, గదాసు రాజేందర్, పవన్ సింగ్, ఇట్యాల రాము, రవి తేజ, చిట్యాల రమేష్, నారపాక అశోక్, కశెట్టి తిరుపతి,...