CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 6:57 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గంగపుత్ర సంఘం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకురాలు భోగ శ్రావణి

జగిత్యాల, జూన్ 10 (చైతన్య గళం):జగిత్యాల పట్టణంలోని వాణినగర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ జాతర బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్, బిజెపి నాయకురాలు భోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణి

ఈ సందర్భంగా ఆమెతో పాటు సంఘ సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆముదరాజు, దూరిశెట్టి మమత, గదాసు రాజేందర్, పవన్ సింగ్, ఇట్యాల రాము, రవి తేజ, చిట్యాల రమేష్, నారపాక అశోక్, కశెట్టి తిరుపతి, బద్దెల గంగరాజు, బోగ నరేష్, దూరిశెట్టి రమణ తదితరులు హాజరై బోనాల ఉత్సవాన్ని విజయవంతం చేశారు.